<strong>సీఎం స్థానంలో ఉండి చిల్లర రాజకీయాలా...</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ</strong>హైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్ వైయస్‌ర్‌సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖంలో మానవత్వం కనబడకుండా కూరత్వం కనబడుతుందన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై అడు,వీడు అంటూ చంద్రబాబు వాడిన పదజాలం దారుణమన్నారు. చంద్రబాబు భాష, చేష్టలు,చేతలు చూస్తే రాష్టానికి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా అని రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. వైయస్ జగన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లోటస్‌పాండ్‌లోని తన ఇంటికి వెళ్ళి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే ఆసుప్రతిలో చేరారని టీడీపీ నేతలు ఆరోపించడం దుర్మార్గమన్నారు. వైయస్ జగన్ ముందు, వెనుక పచ్చమీడియా ఉందని వాస్తవం ఏమిటో వారినే అడిగి తెలుసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు వైయస్ జగన్‌ను పరామర్శించకూడదా..అని పశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రమాదం జరిగిందని మానవత్వంతో తక్షణమే స్పందించి ఖండించవలసిన చంద్రబాబు విష ప్రచారం చేసి రాజకీయాలకు ప్పాడుతుందున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్‌పై హత్యాయత్నం సంఘటనపై రాష్ట్ర పోలీసులు, డిజిపి ఒకొక్కరూ ఒకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. సంఘటన జరిగిన గంటలోపే ప్రెస్‌మీట్‌లు పెట్టి వైయస్‌ఆర్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడ్ని భద్రతా సిబ్బంది జేబులంతా తనిఖీ చేశారని ఏ లేఖ దొరకలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన నాయకులంతా అక్కడే ఉన్నారు. పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని కాని, పట్టుబడిన నిందితుడి వద్ద 11 పేజీల లేఖ వచ్చిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలను మభ్య పెట్టి తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు అనేక కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. డిఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందాన్ని చంద్రబాబు వేశారని, అంతకు ముందు వైయస్ జగన్‌పై దాడి చేసింది వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుడేనని డిఐజి స్థాయి అధికారితో ప్రెస్‌మీట్‌లో చెప్పించి సిట్ బృందం వేసి చేతులుదులుపుకునే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు శాంతి భద్రతలు గురించి మాట్లాడటం హస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పడే ఈ రాష్ట్రంలో శాంతిభద్రదలు ఎలా ఉన్నాయో తెలిసిందన్నారు. ఒక ప్రతిపక్షనాయకుడిపై హత్యాయత్నం జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఎండి హుందాగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. 24 గంటలో టీడీపీ నేతలు నాలుగుసార్లు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏవిధంగా ఘటనను ఏవిధంగా పక్కదారి పట్టిందామా అని నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిందితుడి నుంచి తీసుకున్నామని చెప్పిన లేఖలో పేజీలు ఒకే చేతి రాతలో లేవని,అక్షరాల్లో తేడా వుందన్నారు. దీనిపై విచారణ జరపాలన్నారు. దేవుడి కృపతోనే వైయస్ జగన్‌కు పెనుప్రమాదం తప్పిందన్నారు.<br/> Attachments area<br/>