ఆకాశానికి ఎత్తి.. పాతాళంలోకి తొక్కేయడం బాబు నైజం..

టీడీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు..
ప్రచార్భాటమే తప్ప అభివృద్ధి శూన్యం..
వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి
విజయనగరంః యువతను చంద్రబాబు నిలువునా మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలే వద్దనడం దారుణమన్నారు.  విభజన రాష్ట్రంలో అపారమైన ఉద్యోగాలు కల్పిస్తామని, వేలాది పరిశ్రమలు తీసుకునివస్తానని,లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటూ ఊకదంపుడు ప్రకటనలు ఇచ్చి యువతను చంద్రబాబు మోసం చేశారన్నారు.రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఉంటే ఏ విభాగం కూడా ఉద్యోగాలు ప్రకటనలు చేయాకూడదని ఆదేశాలు జారీచేయడం దారుణమన్నారు. కేవలం యువతనే కాదని అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రచార్భాటమే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఏవర్గం కూడా చంద్రబాబు పాలన మీద కిచిత్‌ కూడా సంతోషంగా లేదన్నారు.నాలుగు  సంవత్సరాలు పాటు టీడీపీ బీజేపీతో అంటకాగి నిత్యం మోదీని పొగడడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రత్యేకహోదాను సమాధి చేసిన చంద్రబాబు ప్రభుత్వం పతనావస్థకు చేరుకోవడంతో మనుగడ సాధించడానికి టీడీపీ యూటర్న్‌ తీసుకుందన్నారు. బీజేపీ నేతలకు సన్మానాలు చేసి, అభినందనలు తెలిపి ప్రత్యేక ప్యాకేజీతోనే అభివృద్ధి అంటూ  ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా ఆకాశంలోకి ఎత్తి..పాతాళంలోకి తొక్కేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top