వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి సమక్షంలో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పలు బస్తీలకు చెందిన వివిధ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సాయినాథ్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముషీరాబాద్‌కు చెందిన కందూరి రామచంద్రయ్య, శ్రీహరి, రాజు, పవన్‌కుమార్‌తో పలు బస్తీలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో వైయస్ఆర్ సీపీకి మంచి భవిష్యత్ ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలోనే డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి అన్ని డివిజన్లకు అధ్యక్షులను ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మాజిద్‌ఖాన్, సూరిబాబు, నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అభిలాష్ గౌడ్ తదితరులున్నారు.