హైదరాబాద్) నేడు అసెంబ్లీలో ద్రవ్య వినియోగ బిల్లు చర్చకు రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన ద్రవ్యం రాకపోకలకు సంబంధించిన పద్దుల మీద చర్చ జరగనుంది. ఇందులో తప్పనిసరిగా పాల్గొనాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరటం జరిగింది. ఇదే విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ప్రత్యేక లేఖ ద్వారా తెలియచేశారు. ఈ లేఖ తో పాటు వైఎస్సార్సీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను అందించటం జరిగింది. మరో వైపు బిల్లును ఆమోదించేందుకు కచ్చితంగా ఓటింగ్ జరపాలని కోరుతూ మరొక లేఖను వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం అందించింది.