వైయస్‌ జగన్‌ కోసం ఎదురుచూపు

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం ఉండి నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారాజు అన్నారు. గురువారం వైయస్‌ జగన్‌కు ఉండి నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ సీఎం అయితే పేదలందరికీ మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో నిరుపేదలందరికీ ఇల్లు కట్టించారన్నారు. ఈ నాలుగేళ్లలో పేదలకు ఒక సెంట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొంటే పింఛన్లు కట్‌ చేస్తామని టీడీపీ నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నిర్భందాలను ప్రజలు లెక్క చేయకుండా తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని వివరించారు. 
 
Back to Top