వైయస్‌ జగన్‌ హామీతో ఆక్వా రైతుల్లో సంతోషం


పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీతో వారిలో సంతోషం ఉప్పొంగుతోందని పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆక్వా రైతుల కష్టాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్‌ యూనిట్‌ రూపాయిన్నరకే పూర్తిగా 5 ఏళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంవత్సరం పాటు రూ. 2లకు యూనిట్‌ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైయస్‌ జగన్‌ ఆక్వా రైతులకు అండగా ఉంటానని చెప్పడంతో.. ఇంకా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన ఎప్పుడు వస్తుందోనని రైతులంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వైయస్‌ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పశ్చిమ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
Back to Top