రిలిఫ్ పంపిణీలో టీడీపీ కార్యకర్తలు అడ్డంగా దోచుకుంటున్నారు.15 రోజుల్లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జననేత వైయస్ జగన్ పర్యటన<br/>విజయనగరంః తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయిందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. రెండు జిల్లాలోని సుమారు 8 నియోజకవర్గాలలో జరిగిన ప్రకృతి విపత్తులో బాధితులకు కనీసం మంచినీళ్లు,విద్యుత్,నిత్యావసర సరుకులు కూడా టీడీపీ ప్రభుత్వం అందించలేకపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 10 రోజులుగా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుల కమిటీతో జననేత వైయస్ జగన్ సమీక్షించినట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని కోణాల్లో బాధితుల కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రాబోవు 15రోజులలో అన్ని ప్రాంతాలకు స్వయంగా వైయస్ జగనే బాధిత ప్రతి వ్యక్తిని కలిసి భరోసా ఇస్తారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రజలకు అండగా నిలబడుతుందని ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 3,464కోట్ల రూపాయలుగా నష్టాన్ని అంచనా వేస్తూ నివేదిక ఇచ్చారన్నారు. జాతీయ విపత్తుగా కేంద్రప్రభుత్వం గుర్తించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి మొత్తాన్ని బాధితులకు పరిహారం చెల్లించాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తుందన్నారు.. తూతూమంత్రంగా నష్టపరిహారాలు చెల్లించి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. .కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక అంచనా ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా బాధితులకు స్పష్టమైన హామీని ఇవ్వాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుల కమిటీ తుపాన్ ప్రభావిత అన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. విద్యుత్ సరాఫరా విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలయ్యిందన్నారు విద్యుత్‌ను పునరుద్ధరించడానికి కనీసం మెటిరియల్ కూడా లేదన్నారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీరు కూడా అందడంలేదన్నారు. 10 రోజులయిన తాగునీరు కూడా ఇవ్వకపోవడం చాలా అవమానకరమన్నారు. రిలిఫ్ పంపిణీలో టీడీడీ కార్యకర్తలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. దోపిడీని నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితుల జాబితాను తయారీలో ఇతర పార్టీల వారితో కూడా కలిసి రూపొందించాలన్నారు. గతంలో టీడీపీ హయాంలో చాలాసార్లు అక్రమాలు జరిగాయన్నారు. ఇప్పుడు అలాంటి అక్రమాలు జరగకుండా చేయాలన్నారు .వైయస్‌ఆర్‌సీపీ కమిటీ జిల్లా కలెక్టర్ ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానున్నట్లు తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ ప్రకటించిన కోటిరూపాయల రిలిఫ్‌ఫండ్‌ను సబంధింత ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవకుల బాధితులకు అందించడం జరుగుతుందన్నారు.