<strong>విజయవాడ :</strong> పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన గుంటురూకు చెందిన తియ్యగూర వెంకటరెడ్డికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయనీ, ఇవి వైయస్ఆర్ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలన్నీ కూడా గాంధేయమార్గంలో, అహింసాయుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటున్నాయని, ఇకపై కూడాఉంటాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ అభిమానిని అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా , ఆ వ్యాఖ్యలను వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకీగాని, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గాని ఆపాదించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.