బాబు డైరక్షన్ ...తమ్ముళ్ల యాక్షన్

చంద్రబాబు కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పచ్చనేతలు అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ లా మార్చేశారు. ప్రతిపక్ష సభ్యులపై మంత్రులు నోరుపారేసుకుంటూ అధికారమదంతో వ్యవహరిస్తున్నారు.  ప్రజాసమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్షం గొంతు నొక్కేలా  చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో మంత్రికి చంద్రబాబు ఒక్కో బాధ్యత అప్పజెప్పారు. చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకునేందుకు పచ్చచొక్కాలు పెద్ద ఎత్తున నాటకాలు వేస్తున్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రతి అంశంపై చర్చజరగాలి, ఇందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఐనా ప్రభుత్వం విపక్షాన్ని పట్టించుకోకుండా ముందస్తు వ్యూహంగా ఐదు రోజుల సమావేశాలను మమ అనిపించేందుకు సిద్ధమయ్యింది .  వైఎస్ జగన్ కాల్ మనీ సెక్స్ రాకెట్ సహా అనేక అంశాలపై చర్చిస్తుంటే మంత్రులు మధ్యమధ్యలో లేవడం వ్యక్తిగత దూషణలకు దిగడం టాపిక్ ను డైవర్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ పచ్చచొక్కాలు ఇష్టానుసారంగా సభను నడుపుకుంటున్నారు.


యనమల డ్యూటీ...
గడికోసారి లేవడం మేం సీనియర్స్ ప్రతిపక్ష సభ్యులకు ఏం తెలవదని రెచ్చగొడతాడు. ఆతర్వాత సస్పెండ్ అంటూ ఆయన స్క్రిప్ట్ చదివేయడం..నిబంధనలు కాలరాస్తూ ఆయన చదివిన పాఠాన్ని స్పీకర్ పాటించడం ఇది అధికారపార్టీ అసెంబ్లీలో ఆడుతున్న డ్రామాలు.

అచ్చెన్నాయుడు..
ఈయన చంద్రబాబు సైగ చేయడమే ఆలస్యం ప్రతిపక్ష సభ్యులను నోటికొచ్చినట్లు దూషించడం మొదలుపెడతాడు. 

కాల్వ శ్రీనివాస్ ...
ఈయన ఏం మాట్లాడుతాడో కూడా ఎవరికి అర్థం కాదు. మాట్లాడితే వైఎస్ జగన్ ను దూషించడం చర్చను తప్పుదోవ పట్టించడం. 

ఇలా టీడీపీ నేతలంతా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారు. అయినా  వాళ్లపై  ఎలాంటి చర్యలుండవు. కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ గొంతు నొక్కుతూ మైక్ లు కట్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. సభలో ప్రజాసమస్యలపై చర్చ జరిగితే తమ అరాచకాలు బయటపడతాయని, వైఎస్ జగన్ కు పేరొస్తుందని చంద్రబాబు అండ్ కో వణుకుతోంది. అందుకే పచ్చచొక్కాలు స్కెచ్ ప్రకారం ప్రతిపక్షంపై ఎదురుదాడి కొనసాగిస్తూ ప్రజల దృష్టి మరల్చేవిధంగా కుట్ర చేస్తున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top