నైతిక‌త ఉంటే చంద్ర‌బాబు రాజీనామా చేయాలి

ఇది ప్ర‌జాస్వామ్యానికే సిగ్గుచేటు
అసెంబ్లీకి వ‌చ్చి దాక్కొంటారా..!
స‌భ‌ను చంద్ర‌బాబు భ్ర‌ష్టు ప‌ట్టించారు..!
అధికారం ఉంది క‌దా చెల‌రేగుతారా..!

హైద‌రాబాద్: ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు భ‌య‌ప‌డి ముఖం చాటేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. అసెంబ్లీకి వ‌చ్చి స‌భలోకి రాకుండా దాక్కొన్నార‌ని ఆయ‌న అన్నారు. నైతికత ఉంటే చంద్ర‌బాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాక వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..!

ఉలుకు ఎందుకు..!
ఓటుకి కోట్లు కుంభ‌కోణం మీద చ‌ర్చ‌కు స‌రైన రీతిలోనే డిమాండ్ చేశాం. వాయిదా తీర్మానం ఇచ్చాం, నిబంధ‌న 344 కింద నోటీసు ఇచ్చాం.  మొట్ట‌మొద‌టిసారి ఒక ముఖ్య‌మంత్రి లంచం ఇవ్వ‌చూపుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఒక టీడీపీ ఎమ్మెల్యే డ‌బ్బు ఎర‌చూపుతూ దొరికాడు. ఇంత‌టి ఆధారాలు ఉన్న అంశం మీద అసెంబ్లీలో చ‌ర్చిద్దాం అంటే అనుమ‌తి ఇవ్వ‌కుండా పారిపోయారు. అధికారం ఉంది క‌దా అని స్పీక‌ర్ స్థానం త‌మ‌దే క‌దా అని ఈ ర‌కంగా ప్ర‌వ‌ర్తించ‌టం ఎంత వ‌ర‌కు న్యాయం. అసెంబ్లీకి వ‌చ్చి కూడా త‌న గ‌దిలో కూర్చొని బ‌య‌ట‌కు రాకుండా స‌మావేశాల‌కు రాకుండా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం చేశారు. నైతికత ఉంటే ఆయ‌న రాజీనామా చేయాలి. 

లంచాల మ‌యం..!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లంచాలు ప‌ట్టిన డ‌బ్బుని తెలంగాణ లో విర‌జిమ్మి.. దాదాపు 8 మంది ఎమ్మెల్యేల‌ను కొనేందుకు ప్ర‌య‌త్నించి దొరికి పోయారు. ఇది 100-150 కోట్ల స్కామ్‌. ప‌ట్టిసీమ‌లో అవినీతి, ఇసుక మాఫియాలో అవినీతి, మ‌ట్టి త‌వ్వకాల్లో అవినీతి, బొగ్గు లో అవినీతి, పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇంటెన్సివ్‌లు ఇవ్వ‌టంలో అవినీతి.. ఈ ర‌కంగా ప‌రిపాల‌న ఉంది కాబ‌ట్టే అవినీతిమ‌యం అని అంటున్నారంతా..! ఒక ఛార్జిషీటులో ముక్య‌మంత్రి పేరు 22 సార్లు ఉద‌హ‌రించటాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. అంత ఎందుకు...! ఫోరెన్సిక్ ల్యాబ‌రేట‌రీ నివేదిక‌ల‌తో చంద్ర‌బాబు గొంతు నిర్ధార‌ణ అయింది. ఇది నా గొంతు కాదు అని చెప్పుకొనే ధైర్యం లేక‌నే అసెంబ్లీకి రాకుండా దాక్కొన్నారు. 

మా వైఖ‌రి సుస్ప‌ష్టం
ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద వైఎస్సార్ సీపీ వైఖ‌రి సుస్ప‌ష్టం. ప‌ట్టిసీమ‌ను మేం వ్య‌తిరేకిస్తున్నాం. దీనికి నిల్వ సామ‌ర్థ్యం లేదు క‌న‌క‌, టెండ‌ర్ల‌లో గోల్ మాల్ జ‌రిగింది క‌నుక‌, కాంట్రాక్ట‌ర్ల‌ను బాగా ఉప‌యోగించుకొన్నారు క‌నుక‌, దీన్ని వ్య‌తిరేకిస్తున్నాం. అదే పోల‌వరం ప్రాజెక్టులో నిల్వ చేసుకొనే వెసులు బాటు ఉన్నందున దీన్ని కోరుకొంటున్నాం. గోదావ‌రి కి వ‌ర‌ద‌లు వ‌స్తున్న‌ప్పుడు ఆ నీటిని నిల్వ చేసుకొని, ఏడాది పొడ‌వునా ఉప‌యోగించుకొనేందుకు వీలవుతుంది. అన్ని స‌మ‌స్య‌ల‌కు సంజీవ‌ని పోల‌వరంమాత్ర‌మే. రాయ‌ల‌సీమ మీద ప్రేమ లేదు అని అంటున్నారు, కానీ ప‌ట్టి సీమ మీద ఇచ్చిన జీవో ను చూస్తే మాత్రం ఎక్క‌డా రాయ‌ల‌సీమ అన్న ప‌ద‌మే క‌నిపించ‌దు. 

స‌మ‌స్య‌లు అలాగే ..!
చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి దాదాపు 15 నెల‌లు అవుతోంది. ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వ‌లేదు స‌రిక‌దా ఉన్న ఉద్యోగుల్ని తీసేసి పంపిస్తున్నారు. ఒక్క ఫ్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదు. అంగ‌న్ వాడీల‌కు జీతం పెంచ‌మంటే పెంచ‌టం లేదు. నిరుద్యోగుల‌కు వ‌యో ప‌రిమితి పెంచ‌లేఉద‌. ఇంటింటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అన్నారు. ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి కాబ‌ట్టి స‌మావేశాలు 15 రోజులు పెట్టండి లోతుగా చ‌ర్చిద్దాం అంటే ఒప్పుకోలేదు. చివ‌ర‌కు అసెంబ్లీని భ్ర‌ష్టుప‌ట్టించిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. 
Back to Top