ప్రత్యేక హోదా కోసం మడకశిరలో ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం
 అనంత‌పురం: :రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మడకశిరలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం  ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని మడకశిర -అమరాపురం ప్రధాన రహదారిపై ఈ విద్యార్థి విభాగం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి డీ మంజునాథ్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.  ఉద్యోగ అవకాశాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలిపారు.  
Back to Top