వైయస్సార్‌సీపీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ సాంస్కృతిక, ప్రచార కమిటీలు నిర్ణయించాయి. ఆట, పాటలతో పాటు బుర్రకథలు వివిధ రూపాల్లో పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, ప్రచార కమిటీ కన్వీన‌ర్ విజయచంద‌ర్‌ల నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ప్రచార కార్యక్రమాలు ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు సినిమా, టీవీ, రంగస్థల నటులు హాజరయ్యారు. పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, పి.ఎన్.వి.ప్రసాద్‌ హాజరై పలు సూచనలు, సలహాలిచ్చారు.

వైయస్ఆర్‌సీపీ ప్రచార కమిటీ జిల్లాల ఇన్‌చార్జిలు :
పార్టీ ప్రచార కమిటీ జిల్లా, మండల కమిటీలను త్వరితగతిన పూర్తిచేయడం కోసం రాష్ట్ర కమిటీకి చెందిన సభ్యులను పలు జిల్లాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. వివరాలను పార్టీ ప్రచార కమిటీ విభాగం కన్వీనర్ విజయచంద‌ర్ తెలిపారు. ఇ‌న్‌చార్జిలుగా నియమితులైన వారిలో జొన్నల శ్రీనివాస్‌రెడ్డి-పశ్చిమగోదావరి, డి.బాబు-ప్రకాశం, ఎస్.రవికుమార్-మహబూబ్‌నగర్, ఆర్.సింగారెడ్డి-నెల్లూరు, లెంకబాబు-విజయనగరం, జి. వెంకటరెడ్డి-తూర్పుగోదావరి, ఎస్.యాదయ్య-చిత్తూరు, ఎం.గంగారెడ్డి-ఖమ్మం, ఎస్.పాండురంగారెడ్డి-కర్నూలు, డి.సత్యనారాయణ-విశాఖ, ఎన్.వసుంధర-గుంటూరు, ఎస్ఏ ఖలీఫ్-వై‌యస్ఆర్ కడప ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top