30న చ‌లో విశాఖ‌

‘వంచన వ్యతిరేక దీక్ష’కు పార్టీ శ్రేణులు సన్నద్ధం  
- విశాఖ‌కు త‌ర‌లివెళ్లేందుకు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఏర్పాట్లు

 
 అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న విశాఖపట్నంలో జరుపనున్న ‘వంచన వ్యతిరేక దీక్ష’కు పార్టీ శ్రేణులు సిద్ధమ‌వుతున్నారు.  వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌ను విజ‌యవంతం చేయాల‌ని పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు  పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు విశాఖపట్నంకు బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు (12 గంటలు) జరిగే నిరాహార దీక్షలో నల్ల చొక్కా లేదా నల్ల టీషర్ట్‌ ధరించి పాల్గొనాలని సర్క్యులర్‌లో పేర్కొన‌డంతో ఆ స‌మ‌యంలోగా విశాఖ‌లో ఉండేందుకు రెడీ అవుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top