పోలవరానికి వైయస్‌ఆర్‌ సీపీ బస్సుయాత్ర





పోలవరానికి వైయస్‌ఆర్‌ సీపీ బస్సుయాత్ర
ప్రాజెక్టును సందర్శించనున్న పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, సీనియర్‌ నేతలు
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర
చంద్రబాబు పోలవరానికి సమాధి కట్టాలని చూస్తున్నాడు

హైదరాబాద్‌: పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు ఈ నెల 7న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోలవరానికి బస్సు యాత్ర చేపట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేతులెత్తేస్తూ దానికి శాశ్వతంగా సమాధికట్టేలా వ్యవహరిస్తుందని పార్టీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఒత్తిడి చేయడానికి వైయస్‌ఆర్‌ సీపీ నిర్ణయిచింది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకురావడంతో పాటు కుడి, ఎడమ కాల్వల నిర్మాణం దాదాపు 70 నుంచి 80 శాతం పూర్తి చేశారని పార్టీ గుర్తు చేసింది. వైయస్‌ఆర్‌ వారసులుగా పోలవరం నిర్మాణాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలందరి అత్యంత ప్రాధన్య అవసరంగా వైయస్‌ఆర్‌ సీపీ భావిస్తుంది.

 చంద్రబాబు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండుకుని పోలవరాన్ని ఇప్పుడు వదిలేసేందుకు పన్నాగం పన్నుతున్నారని మొదటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతూ వచ్చింది. పోలవరం ప్రాజెక్టును రక్షించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగానే సీనియర్‌ నాయకులు పోలవరం యాత్రకు వెళ్లనున్నారు. అమరావతిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 
Back to Top