ఉరవకొండలో కొనసాగుతున్న బంద్

అనంతపురంః ఉరవకొండలో బంద్ కొనసాగుతోంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది. ఐతే, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 



Back to Top