ప్రజల పొట్టకొట్టడమే చంద్రబాబు పని


ఆటోలను తాళ్లతో లాగిన మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులు
అదనంగా వసూలు చేసే 4 శాతం ఎవరి ఖాతాలోకి వెళ్లిందని ప్రశ్న

విజయవాడ: పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నడ్డివిరుస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌ ట్యాక్స్‌ల పేరుతో లీటర్‌పై అధనంగా రూ. 4 వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా  విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెట్రో ధరలకు వ్యతిరేకంగా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, భవకుమార్‌లు, పలువురు కార్పొరేటర్లు ఆటోలను తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి రోజు ఆంధ్రరాష్ట్రంలో ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్‌ ఉపయోగిస్తున్నారు.. వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధనంగా వసూలు చేస్తున్న రూ. 4 ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలతో ప్రతి ఒక్కరి జీవితాలు ఆధారపడ్డాయని గ్రహించి నడ్డివిరుస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఆంధ్రరాష్ట్ర ప్రజానీకాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ ఒక్కరు ఆందోళనలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వాలు తక్షణమే ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top