తాళ్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యమే పార్టీకి ఊపిరి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌డ్డి అన్నారు. మండలంలోని నాగంబొట్లవారిపాలెం, దోసకాయలపాడు గ్రామాలలో బుధవారం రాత్రి గుడారాల పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రభపై ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీ నాయకులు నీరు, చెట్టు, ఉపాధి పనులతో పాటు అన్ని రకాల కాంట్రాక్టులతో దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు.<br/>మాట తప్పని మడమ తిప్పని నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెలో చిరస్థాయిగా నిలచి పోయారని గుర్తు చేసారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన సేవ మరువలేనిదని అన్నారు. ఆయన తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోనికి వచ్చి సీఎం అయితేనే అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా పేదలకు అందుతాయని భరోసా ఇచ్చారు. ఆయన పాలనలోనే ప్రకృతి పులకించి రైతులు సుభిక్షంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. గత మూడేళ్ల నుండి కార్యకర్తలు పడుతున్న బాధలను చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసారు. మరో కొంత కాలం ఈ బాధలు తప్పవని తర్వాత మంచి రోజులు వస్తాయని అప్పటి వరకు అన్ని కష్టాలు భరించాలని అన్నారు. ఆయా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. <br/>