హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కూన దయానంద్‌గౌడ్ సో మవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో మూడు వేల మంది కూడా పార్టీలో చేరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం కన్వీనర్, కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ నాయకుడు కొలన̴్ శ్రీనివాస̴్రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, వై.వి. సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు దయానంద̴్గౌడ్ తదితరులు భారీ ఎత్తున ర్యాలీగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన̴్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.