రైతు సమస్యలపై వైయస్సార్‌సీపీ ఆందోళన

మడకశిర: రైతు సమస్యలపై వైయస్సార్‌సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వెంటనే రైతు సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి పట్టణంలోని వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆ తర్వాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గంటసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

Back to Top