వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

ఉప్పలగుప్తం : దివంగత సీఎం డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామంలో శనివారం నిర్వహించనున్నట్టు వైయస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు బద్రి బాబ్జీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హజరు కావాలని ఆయన కోరారు. ఎన్‌ కొత్తపల్లి, గోపవరం, భీమనపల్లి, గొల్లవిల్లి పంచాయతీ వాడపర్రు గ్రామాల్లో ఉన్న వైయస్‌ విగ్రహల వద్ద పార్టీ గ్రామ కమిటీలు నివాళులర్పించిన అనంతరం స్థానిక బాలయోగి పార్క్‌లో నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొనాలని ఆయన కోరారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, వైయస్సార్‌ అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

గొల్లవిల్లిలో పార్టీ సమావేశం
గొల్లవిల్లి సెంటర్‌లోని భీమేశ్వర ఆడిటోరియంలో శనివారం పార్టీ మండల సమావేశం నిర్వహించనున్నట్టు బాబ్జీ చెప్పారు. పార్టీ రాష్ట్ర, జిల్లా విభాగాల్లో ఉన్న ముఖ్య నేతలు సమావేశానికి హాజరవుతారని, మండల కమిటీ, అనుబంధక కమిటీ సభ్యులందరూ విధిగా సమావేశానికి రావాలన్నారు. పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పార్టీ కేడర్‌ను సమాయక్తం చేసేందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సూచనలపై సమావేశంలో చర్చ ఉంటుందని ఆయన తెలిపారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top