విగ్రహ తొలగింపు దుర్మార్గపు చర్య

వరంగల్: వరంగల్‌ జిల్లాలోని పరకాల మండల కేంద్రంలో రాత్రికి రాత్రే మహానేత వైయస్‌ఆర్‌ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతకుమార్‌ డిమాండ్‌ చేశారు. విగ్రహాలను మాయం చేస్తారేమో కానీ, ప్రజల గుండెల్లోంచి వైయస్‌ఆర్‌ను ఎవరూ తొలగించలేరని నాడెం స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top