ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్

ప్రజల హృదయాల్లో చెరగని సంతకం వైయస్సార్
వైయస్సార్ అడుగుజాడల్లో వైయస్ జగన్
ఆయన ఆశయసాధన కోసం అలుపెరగని పోరాటం

అమెరికాః చికాగోలో జరుగుతున్న ఆటా ఉత్సవాలకు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అక్కడ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

పేద‌వారికి కార్పొరేట్ వైద్యం అందించింది వైయ‌స్సారే...
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
పేద‌రికం అనేది విద్య‌, వైద్యానికి అడ్డురాకూడ‌ద‌ని పేద‌ల కోసం ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ వంటి మ‌హాత్ కార్యాన్ని భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి సారిగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ పెట్టార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ద్వారా చ‌దువుకున్న ఎంతో మంది ఈ రోజు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లుగా ఉన్నార‌న్నారు. ప్ర‌తి పేద‌వాడు కార్పొరేట్ ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకోవ‌డానికి కార‌ణం ఒక్క ఆరోగ్య శ్రీ ప‌థ‌క‌మేన‌న్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భౌతికంగా దూర‌మై ఏడేళ్ళు గ‌డుస్తున్నా ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నార‌న్నారు. వైయ‌స్సార్ అడుగుజాడ‌ల్లోనే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిరంత‌రం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం పాటుప‌డుతున్నార‌న్నారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. తిరిగి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలన అందుతుందని చెప్పారు.  

వైయ‌స్సార్ కోట్ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా ఉన్నారు
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమన క‌రుణాక‌ర్ రెడ్డి
15 కోట్ల మంది తెలుగువారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన చిర‌స్మ‌ర‌ణీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖ‌ర‌రెడ్డి అని భూమన క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. త‌న 35ఏళ్ల రాజ‌కీయ జీవితంలో అలుపు ఎర‌గ‌కుండా, ఆల‌స‌ట చెంద‌కుండా, విరామం తెలియ‌కుండా నిరంత‌రం శ్రమిస్తూ ప్ర‌తి ఒక్క‌రిలో చైత‌న్య దీప్తిని ర‌గిలిస్తూ సాగిన ప‌య‌నం డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

వైయ‌స్సార్‌ను న‌మ్మిన ప్ర‌జ‌ల కోసమే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గిరి ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రి ఉన్న‌ప్పుడు వాన‌పాములుగా ఉన్నావారంద‌రూ, వైయ‌స్సార్ మ‌ర‌ణించిన త‌రువాత తాచుపాములై వైయ‌స్సార్ కుటుంబాన్ని కాటు వేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గిరి ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా అన్నారు. వైయ‌స్సార్ కుటుంబాన్ని ప్ర‌జ‌ల‌కు లేకుండా చేయాల‌ని ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు జ‌రుగుతున్నాయో ప్ర‌జ‌లంద‌రు గ‌మ‌నిస్తున్నార‌ని రోజా తెలిపారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమానులు ఉన్నంత‌వ‌రకూ ఈక కూడా పీక‌లేర‌న్నారు. వైయ‌స్సార్ అభిమానులు ఆంధ్ర నుంచి అమెరికా వ‌ర‌కు ఉన్నార‌న్న విష‌యం వారు తెలుసుకోవాల‌న్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తాను లేని లోటును తీర్చ‌డానికే వైయ‌స్ జ‌గ‌నన్నను ఇచ్చార‌ని ఆమె తెలిపారు.  వైయ‌స్సార్ ఆశ‌యాల‌కు అనుగుణంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టార‌ని, ఎన్ని అవ‌మానాలు, అడ్డంకులు ఎదురైనా ఒక్క చిరున‌వ్వుతో వాటిని తొసుకుంటూ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నార‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న‌న్న‌కు ఇన్ని అవ‌మానాలు అవ‌స‌రం లేద‌ని కేవ‌లం త‌న తండ్రిని న‌మ్మిన ప్ర‌జ‌ల క‌ష్టాల కోసం జ‌గ‌న‌న్న వైయ‌స్సార్‌సీపీ పెట్టార‌న్నారు. 

సాహసోపేతమైన ముఖ్యమంత్రి వైయస్సార్
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
తెలుగు రాష్ట్రాల్లో మ‌ర‌ణించిన వారిలో గొప్ప ముఖ్యమంత్రులు,  స్వ‌యంకృషితో సీఎం అయిన వ్యక్తులు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ త‌న సొంత పార్టీలో ముఖ్య‌మంత్రి అయితే... డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌రరెడ్డి మాత్రం జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయ‌కుడిగా ఎదిగి, పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు త‌న భూజ‌స్కందాల‌పై వేసుకొని ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మ‌హానుభావుడు దివంగ‌త వైయ‌స్సార్ అన్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణించ‌క‌పోయిన‌ట్ల‌యితే ఆయ‌న వ‌ద్ద‌నేంత వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండేవార‌ని ఆయ‌న పేర్కొన్నారు. మంచివాళ్ల‌నే భ‌గ‌వంతుడు తొంద‌ర‌గా తీసుకెళ్తాడ‌న‌డానికి డాక్ట‌ర్ వైయ‌స్సార్ మ‌ర‌ణం ఉదాహ‌రణగా చెప్ప‌వ‌చ్చ‌న్నారు. వైయస్సార్ ఎవ‌రి మోచేతి నీళ్లుతాగి రాజ‌కీయాలు న‌డిపినటువంటి వ్య‌క్తి కాద‌న్నారు. సాహ‌స‌వంత‌మైన రాజ‌కీయాలు న‌డిపినటువంటి మ‌హానేత వైయ‌స్సార్ అన్నారు. వేల కిలోమీటర్లు పాద‌యాత్ర చేసిన ప్ర‌పంచంలో అరుదైన వ్యక్తి డాక్ట‌ర్ వైయ‌స్సార్ అన్నారు. రాజ‌కీయాలంటే మెనేజ్‌మెంట్‌, మ్యానిప్లేష‌న్‌, డ‌బ్బులు వెద‌జ‌ల్ల‌డం, కొన‌డమ‌నేది ఒక అర్థ‌మైతే.... వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆ అర్థాన్ని తిర‌గ‌రాస్తూ రాజ‌కీయ‌మంటే సాహసం, ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం, ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌తంగా నిలిచిపోవ‌డమ‌ని నిరూపించిన ఏకైక వ్య‌క్తి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని అంబ‌టి తెలిపారు. 

జ‌గ‌న‌న్న‌ను సీఎం చేయ‌డ‌మే వైయ‌స్సార్‌కు ఘ‌న‌మైన నివాళి
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌
వైయస్సార్ స్ఫూర్తి, ఆయన ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైయ‌స్సార్ గారికి మ‌న‌మిచ్చే ఘ‌న‌మైన నివాళి 2019లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మేన‌న్నారు. 

మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని వ్య‌క్తి వైయ‌స్సార్‌
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి
మాట ఇస్తే మడ‌మ తిప్ప‌ని వ్య‌క్తి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ 2009లో సీఎం క్యాంప్  కార్యాల‌యానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ త‌న ఊరివారైనా ఇద్ద‌రు క‌నిపించార‌ని, ఇక్క‌డ ఏం చేస్తున్నార‌ని అడిగితే ఈ రోజు ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంద‌ర్నీ క‌లుస్తున్నార‌ని, త‌మ‌కు గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం అడిగేందుకు వ‌చ్చామ‌ని చెప్పారని ఆయన తెలిపారు.  తాను లోప‌లికి వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి వెళ్లేప్పుడు ఏమైంద‌ని వారిని అడ‌గ్గా మాకు రెండు నెల‌ల్లో గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగం ఇస్తామ‌ని వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హామీ ఇచ్చార‌ని చెప్పారు.  స‌రిగ్గా రెండు నెల‌ల త‌రువాత మంగంపేట భైరటీస్ మైన్‌లో ఉద్యోగం వ‌చ్చింద‌న్నారు. ఇచ్చిన మాట‌కు వైయ‌స్సార్ క‌ట్టుబ‌డి ఉంటార‌న‌డానికి ఇది ఒక నిద‌ర్శ‌మ‌న్నారు. తాజా ఫోటోలు

Back to Top