వైయస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ వైయస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి 13 జిల్లాల యూనియన్ సభ్యులు హాజరయ్యారు. వైయస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ పై  ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఉద్యోగులను ఇప్పటివరకూ రెగ్యులరైజ్ చేయలేదని, తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చడం లేదని వాపోయారు.

Back to Top