నంద్యాల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌దే విజ‌యం

* బాబు దిష్టిబొమ్మనే దహనం చేయాలి
* కుయుక్తుల‌తో నంద్యాల‌లో గెలిచే ప్ర‌య‌త్నం
* విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేయ‌డం జ‌గ‌న్ నైజం
* ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి
మదనపల్లె రూరల్‌ : ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌నే ద‌హ‌నం చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం ఎమ్మెల్యే విలేక‌రుల‌తో మాట్లాడుతూ నంద్యాల బహిరంగ సభలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు ఉలిక్కిపడుతున్న టీడీపీ కార్యకర్తలు అందులో తప్పుగా ఏం మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా మాట ఇచ్చి తప్పినప్పుడు నిన్ను నడిరోడ్డుమీద కాల్చినా తప్పులేదంటూ చెప్పడం రాయలసీమలో సర్వసాధారణమన్నారు. దానిని వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్న నాయకులు చంద్రబాబు చట్టసభల్లో ఎన్నోమార్లు నీ అంతు చూస్తా.. నీ కథ తేలుస్తా...అంటూ నియంతలా బెదిరించినపుడు ఎందుకు స్పందించలేదో తెలపాలన్నారు. హిట్లర్, గడాఫీల నియంత పాలన కంటే చంద్రబాబు నిరంకుశ పాలన మించిపోయిందన్నారు. జన్మభూమికమిటీల పేరుతో అప్రజాస్వామ్యిక పాలనచేస్తూ దేశంలోనే అవినీతిలో నంబ‌ర్ 1గా పేరు మోసాడ‌న్నారు. దక్షిణభారతదేశంలో స్థూలఆదాయంతో పోలిస్తే చివరిస్థానంలో రాష్ట్రాన్ని నిలిపారన్నారు. నేను వేసిన రోడ్లపై నడవద్దు, సబ్సిడీ బియ్యం తీసుకోవద్దు అంటూ ఆంక్షలు విధిస్తున్న బాబు ప్రాజెక్టుల పేరుతో ధనదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో 13,704 మంది బోగస్‌ ఓటర్లును చేర్పించి, అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు.  ప్రజాస్వామాన్ని పరిరక్షించేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే శిల్పా చక్రపాణిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం జరిగిందన్నారు. 
-------------------------
జ‌గ‌న్‌ను విమ‌ర్శించే అర్హ‌త టీడీపీకి లేదు
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని విమ‌ర్శించే అర్హ‌త టీడీపీకి గానీ, ఆ పార్టీ నాయ‌కుల‌కు గానీ లేద‌ని పెద్ద‌తిప్ప స‌ముద్రం మండ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆరోపించారు.  పీటీఎం బస్టాండ్‌లో శనివారం టీడీపీ నాయ‌కుల తీరుకు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధిష్టానం పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. వర్షాల్లేక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రైతాంగానికి హంద్రీ నీవా జలాలతో ఊరట నిస్తానని పాలకులు ఏడాదికో మాట చెబుతున్నారే గాని కాలువల పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ పాలకులకు జగన్‌ దిష్టి బొమ్మను కాల్చే అర్హత లేదన్నారు. 
-------------------
నంద్యాల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌దే విజ‌యం
* ఎమ్మెల్యే చింతల రామ‌చంద్రారెడ్డి 
వాల్మీకిపురం (నంద్యాల‌):  చంద్ర‌బాబు నాయుడు ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా చివ‌ర‌కు నంద్యాల‌లో గెలిచేది మాత్రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌ని ఎమ్మెల్యే చింతల రామ‌చంద్రారెడ్డి అన్నారు. శ‌నివారం నంద్యాల‌లో 26వ వార్డులో ఇంటింటి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించి నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిని ఓడించేందుకు రాత్రికిరాత్రే కోట్లుకు కోట్లు నిధులను మంజూరు చేస్తూ నంద్యాలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇలా ఒక వ్యవస్థ అంతా ఐక్యమై కేవలం ఒక ప్రతిపక్షపార్టీకి చెందిన అభ్యర్థిని ఓడించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలంతా జగన్‌ వైపు ఉన్నారని స్ప‌ష్టం చేశారు. 
--------------------
Back to Top