తూర్పు గోదావరిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ జయకేతనం

కాకినాడ‌, 23 జూలై 2013:

పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు‌ అత్యధిక సంఖ్యలో గెలుపు సాధించి విజయదుందుభి మోగించారు. రంపచోడవరం మండలం దొరమామిడిలో సత్తిబాబు, మర్రిగూడెంలో కారం సావిత్రి విజయం సాధించారు. కోరుకొండ మండలం నర్సాపురం, రాయవరం మండలం లదురుబాక, మండపేట మండలం నెర్నిపాడులో పార్టీ మద్దతుదారులు గెలిచారు. కే. గంగవరం మండలం పామర్రులో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ మేరకు ఇక్కడ రీ‌ కౌంటింగ్ జరిపారు. రీ‌ కౌంటింగ్‌లోనూ వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ ఫలితాన్ని ప్రకటించకుండా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడ్డుకోవడం గమనార్హం.

తాజా వీడియోలు

Back to Top