పంచాయతీ ఎన్నికలలో 5268 స్థానాలు

హైదరాబాద్ 31 జూలై 2013:

హైదరాబాద్ 31 జూలై 2013: సీమాంధ్ర జిల్లాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాల్లోనూ పట్టు నిరూపించుకుంది. వైయస్ఆర్ జిల్లా, చిత్తూరు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో పార్టీ అత్యధి కస్థానాలను గెలుచుకుంది. ఖమ్మం, అనంతపురం జిల్లాలో మాత్రమే టీడీపీ ఆధిక్యాన్ని చూపింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. టీఆర్‌ఎస్ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సాధించింది. బుధవారం నాటి మూడో విడత ఎన్నికలకు సంబంధించి అర్ధరాత్రి వరకు విడుదలైన ఫలితాలకు ఏకగ్రీవ, మొదటి రెండువిడతల ఫలితాలను కలిపి చూస్తే... రాష్ర్టవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ 5268 పంచాయతీలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 5733 స్థానాల్లోనూ, టీడీపీ 5327 స్థానాలనూ గెలుచుకుంది.  సీమాంధ్ర ప్రాంతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు దశల ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి 4645 పంచాయతీల్లో విజయకేతనం ఎగరేసింది. ఇలా ఉండగా, తొలి రెండు దశల్లో 3782, తుది దశలో 1486 స్థానాల్లో గెలిచింది. మొత్తం మీద కోస్తా జిల్లాల్లో 2962, సీమ జిల్లాల్లో 1683 స్థానాలను పార్టీ వైవసం చేసుకుంది. మూడో దశలో గెలిచిన స్థానాల సంఖ్య ఇలా ఉంది.
 శ్రీకాకుళం జిల్లాలో 70, విశాఖపట్నం జిల్లాలో 90, తూర్పు గోదావరిలో 61, ప.గోలో 76, కృష్టాలో 142,  గుంటూరులో 109, నెల్లూరులో 85, ప్రకాశం 85, కర్నూలులో 78, చిత్తూరులో 199, కడపలో 114, అనంతపురంలో 149, కరీంనగర్లో 2, రంగారెడ్డిలో 04, ఆదిలాబాద్‌లో 64, నల్లగొండలో 15, వరంగల్ జిల్లాలో 15, మహబూబ్ నగర్లో 20, ఖమ్మంలో 93 స్థానాలలో గెలుపొందింది.
సీఎం జిల్లాలో జయకేతనం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
పార్టీ మద్దతుదారులు శాంతిపురం మండలం121పెద్దూరులో, కుప్పం మండలం వసనాడులో, కొండయ్యగారిపల్లెలో, గంగవరం మండలంలో మూడు పంచాయతీలు, చౌడేపల్లి మండలం చారాలలో, పుంగనూరు మండలం బండ్లపల్లిలో,  చౌడేపల్లి మండలం దుర్గసముద్రంలో, చండ్రమాగులపల్లెలో,  సంపత్‌కోటలో, నిమ్మలపల్లి మండలం సామకోటవారిపల్లెలో, రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లిలో, రెడ్డివారిపల్లెలో, అమ్మగారిపల్లెలో, చెరుకువాడపల్లిలో,  కామిరెడ్డివారిపల్లెలో, తిమ్మనాయినపల్లెలో, గొంగువారిపల్లెలో, పాలమందలో, సోమల్‌ మండలం వల్లిగట్లలో గెలుపొందారు.

Back to Top