పేద‌ల‌కు భ‌రోసా.. వైయ‌స్ఆర్ అమ్మ‌ ఒడి

గుబ్బలపాలెం (మలికిపురం):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప‌థ‌కంలో  అమ్మ ఒడి ప‌థ‌కం పేదల జీవితాలకు ఎంతో భరోసా ఇస్తుందని రాజోలు నియోజక వర్గ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేట‌ర్  బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గుబ్బలపాలెం గ్రామంలో శుక్రవారం వైయ‌స్ఆర్  కుటుంబం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రజా హితమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. భూమి లేని పేదల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు వారి పిల్లల చదువులకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 10 వేల రూ. 20 వేల వరకూ నేరుగా తల్లుల చేతికే అందించేందుకు అమ్మ డి పేరుతో ఈ ప‌థ‌కంను  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి  వచ్చిన వెంటనే అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఈ ప‌థ‌కంనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ప‌థ‌కాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తారని పేర్కొన్నారు. ఆది నుంచి తెలుగు దేశం ప్రభుత్వం తమ మోస పూరిత విధానాలతో ప్రజలకు ఇంకా మభ్యపెడుతుందన్నారు. అధికార, ధన బలంతో గెలుపొందమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ముందుకు సాగుతున్నారని వచ్చే ఎన్నికల్లో అటువంటి దుశ్చర్యలు సాగవని రాజేశ్వరరావు స్పష్టం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top