..హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారు అయింది. మంగళవారం సాయంత్రం ఆయన విజయవాడ వెళుతున్నారు. అక్కడ ఆయన రంజాన్ మాసంలో భాగంగా వచ్చే పవిత్ర దినమైనందున.. ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియచేస్తారు.బుధవారం నాడు వైఎస్ జగన్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు వెళతారు. అక్కడ ఆయన పావన గోదావరి పుష్కరాల్లో పాల్గొంటారు. కొవ్వూరు, రాజమండ్రిల్లో ఆయన పర్యటిస్తారు. గోదావరి మాతకు పూజలు జరిపించి పుష్కర స్నానం ఆచరిస్తారు. <br/>