ప్ర‌జాస్వామ్యం లోనే ఉన్నామా?


 ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని అడిగేందుకు వచ్చిన తమను అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యను నివేదిస్తూ శాంతియుతంగానే వ్యవహరించినా పార్లమెంటు వైపు తమను వెళ్లనీయలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని జగన్ అన్నారు.పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన దాదాపు 3 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివచ్చారని, శాంతియుతంగా తమ డిమాండ్‌ను వినిపిస్తున్నారని వివరించారు. శాంతిభద్రతల పేరుతోనూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని చెబుతూ తమ మార్చ్ ఫాస్ట్‌ను అడ్డుకున్నారని ఆయన చెప్పారు.  ఏ కార్యకర్తా గాయపడకుండా తాను స్వచ్ఛందంగా అరెస్టు అయ్యానని ఆయన ప్రకటించారు. పోలీసులు లాఠీచార్జి చేస్తే కార్యకర్తలు గాయపడతారని జగన్ అన్నారు. అందుకే ఏపీ నుంచి తరలి వచ్చిన ఏడుగురు ఎంపీలు, 66 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు.. అందరూ స్వచ్ఛందంగా అరెస్టయ్యారని జగన్ వివరించారు.

Back to Top