<br/>విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలో నెట్టేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. నాలుగున్నరేళ్లలో లక్షా 50వేల కోట్ల రూపాయల అప్పు చేశారని చెప్పారు. దోచుకోవడానికి చంద్రబాబు ఖజానా మొత్తం ఖాళీ చేసేశారని దుయ్యబట్టారు. ఇసుక,మట్టి, బడ్జెట్ అంతా మింగేశారని విమర్శించారు.