వైయస్‌ వివేకానందరెడ్డి గెలుపు ఖాయం

వైయస్‌ఆర్‌ జిల్లా: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి గెలుపు ఖాయమని ఖాజీపేట మండల కన్వీనర్‌ జనార్థన్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు యరికలరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖాజీపేటలో విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులను డబ్బు ఆశ చూపి టీడీపీ లోబరుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహశ్యం చేసినట్లు ఉందన్నారు. సంఖ్య బలం లేని వారు కేవలం అధికార దర్పం డబ్బుబలంతో గెలవాలనుకోవడం అందుకు అడ్డదారుల్లో ప్రజాప్రతినిధులను లోబరుచుకునేలా చెయ్యడం దారుణం అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వైయస్‌ వివేకానందరెడ్డి ని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.  మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి అనుచర వర్గం వైయస్‌ఆర్‌ సీపీలోకి రావడంతో పార్టీ మరీంతగా బలపడిందన్నారు.రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో  పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఎవ్వరు పార్టీ తరుపున  నిలబడ్డ భారీ మెజార్టీతో గెలడం ఖాయమన్నారు.

Back to Top