విజయమ్మ చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభోత్సవం

వైయస్ఆర్ జిల్లాః జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభించారు. ఆస్పత్రి పక్కనే ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అల్లుడు ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో స్థానికులకు ఈ ఆస్పత్రి అందుబాటులో ఉంటుందని విజయమ్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైయస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top