మూడో రోజు యాత్ర సాగిందిలా..


అనంతపురం: కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం బాధిత కుటుంబాలను టీడీపీ నాయకులు పరామర్శించిన పాపాన పోలేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా కూడేరుకు చేరుకున్న జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని బుకాయించారన్నారు.  ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుతో కూడా అదే విషయాన్ని చెప్పించారని జగన్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి రైతులు అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారని నిరూపిస్తానని సవాల్ చేస్తే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ప్రకటించారన్నారు.  తాను దీక్షలు, భరోసా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం ఆగమేఘాలమీద బాధిత కుటుంబాలకు పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. వైఎస్‌ర్‌సీపీ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు వస్తోందని జగన్ అన్నారు. నేను అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తున్నానని తెలియగానే.. అనంతపురం జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆనాడు అసెంబ్లీలో ఆత్మహత్యల గురించి మాట్లాడితే అసలు ఆత్మహత్యలు లేనే లేవన్నారు చంద్రబాబు. హంద్రీనావా రావడానికి తానే కారణమని చంద్రబాబు అనడం సిగ్గుచేటన్నారు. అబద్ధాల చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. అందరూ కలిసి చంద్రబాబును ఇంటికి పంపిద్దామని ప్రశ్నించేవారు వస్తున్నారంటే తప్పా చంద్రబాబుకు రైతుల సమస్యలు పట్టవా అని ఎద్దేవా చేశారు.

కరువుతో రైతులు ఆత్మహత్యలు
చేసుకుంటుంటే కనీసం బాధిత కుటుంబాలను టీడీపీ నాయకులు పరామర్శించిన పాపాన
పోలేదని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు. రైతు
భరోసా యాత్రలో భాగంగా కూడేరుకు చేరుకున్న జగన్ బహిరంగ సభలో మాట్లాడారు.  
టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో 45 మంది రైతులు ఆత్మహత్య
చేసుకున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తే
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని
బుకాయించారన్నారు.  ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుతో కూడా అదే
విషయాన్ని చెప్పించారని జగన్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల
ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి రైతులు అప్పుల బాధతోనే ఆత్మహత్య
చేసుకున్నారని నిరూపిస్తానని సవాల్ చేస్తే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఆ
తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ప్రకటించారన్నారు.  తాను
దీక్షలు, భరోసా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం ఆగమేఘాలమీద బాధిత
కుటుంబాలకు పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. వైఎస్‌ర్‌సీపీ
పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు
వస్తోందని జగన్ అన్నారు.

వైఎస్ జగన్‌ను కలిసిన ఎస్కేయూ విద్యార్థులు
అనంతపురం:
అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని
మంగళవారం ఎస్కేయూ విద్యార్థులు కలిశారు. నిరుద్యోగ భృతి గురించి చంద్రబాబు
మాటలను వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ దగ్గర ప్రస్తావించారు. కొత్త
ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలన్న విద్యార్థులు
వెంటనే రెగ్యులర్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Back to Top