'రైతు భరోసా యాత్ర' హిందూపురం నుంచి గుంతకల్లు వరకు

అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఈనెల 22వ తేదీ నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ  ఒక  ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి  బయలుదేరి కొడికొండ చెక్‌పోస్టుకు 10.30 గంటలకు చేరుకుని హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. అదే రోజు హిందూపురంలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారన్నారు. 23వ తేదీ పుట్టపర్తి, 24న ఉరవకొండ, శింగనమల, 25,26 తేదీల్లో గుంతకల్లు నియోజకవర్గాల్లో జగన్ యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు..
Back to Top