సాక్షి మాలిక్ కు అభినందనలు

హైదరాబాద్ః  రియో ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సాక్షి మాలిక్ కు వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. సాక్షి మాలిక్ ను చూసి దేశం గర్విస్తోందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది.  

కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా  (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. భారత్ అభిమానుల పతక నిరీక్షణకు తెరదించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా విజయ బావుటా ఎగురేసి బ్రెజిల్ వీధుల్లో  మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top