హైదరాబాద్: వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారు. ఇటీవల వివాహం జరిగిన గ్రంధి శ్రీనివాస్ కుమారుడిని ఆశీర్వదిస్తారు. అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని వధూవరులని ఆశీర్వధిస్తారు. తిరిగి రాత్రికి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.<br/>