పశ్చిమగోదావరి(రాజమండ్రి): ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రిలో కొద్ది రోజుల కిందట మాతృవియోగమైన కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి వైయస్ జగన్ ఆయన్ను పరామర్శించారు. ఈసందర్భంగా కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి వైయస్ జగన్ ఉండ్రాజపురం బయలుదేరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వైయస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయంగా స్వాగతించారు.