<strong>విజయనగరంః</strong> ఇటీవల ప్రమాదంలో గాయపడిన విజయనగరం జిల్లా మెుయిదాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త వెంకటరమణను వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యలో వెంకటరమణ దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించారు. ప్రమాదం ఎలా జరిగింది, ఆరోగ్య పరిస్థితి గురించి ఈ సందర్బంగా వాకబు చేశారు. తనను చూడటానికి ప్రత్యేకంగా వచ్చిన వైయస్ జగన్‌ను చూసి వెంకట రమణ ఆనందానికి ఆవధులేకుండా పోయాయి. వైయస్‌ఆర్ కుటుంబం అంటే తనకు కొండంత అభిమానమని అన్నారు. జననేత పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపారన్నారు. జగనన్న రాకతో తన ఇంట దసరా పండుగ పదిరోజుల ముందే వచ్చినట్లుందని వెంకటరమణ సంతోషవ్యక్తం చేశారు. <br/>