తణుకు సబ్ జైల్లో సత్యవతిని పరామర్శించిన వైయస్ జగన్

పశ్చిమగోదావరి(తణుకు))ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్ తుందుర్రుకు బయలుదేరారు. అంతకుముందు తణుకు సబ్ జైల్లో వైయస్ జగన్ సత్యవతిని పరామర్శించారు. తమ బతుకులను నాశనం చేసే ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన సత్యవతిపై ప్రభుత్వం హత్యాయత్నం కేసు నమోదు చేసి జైల్లో పెట్టింది. 

ఆక్వా పార్క్ వల్ల కాలుష్యంతో రైతులు, మత్స్యకారుల జీవితాలు బుగ్గిపాలవుతాయని తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆక్వా మేనేజ్ మెంట్ కు వత్తాసు పలుకుతూ తుందుర్రు పరిసర గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.  అక్కడ 144 సెక్షన్ విధించి స్థానిక ప్రజలను వేధిస్తూ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోంది. 


Back to Top