నేడు, రేపు విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన

విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాలు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం విజయనగరం చేరుకోనున్న జగన్ సాయంత్రం పట్టణ సమీపంలోని ఆర్కే లేఅవుట్‌లో జరగనున్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు.

రాత్రికి పట్టణంలోని జెడ్పీ అతిథి గృహంలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు మనవడి వివాహ కార్యక్రమంలో భాగంగా జరిగే ఉపనయనానికి హజరుకానున్నారు. 11గంటలకు నెల్లిమర్ల నుంచి బయలుదేరి విశాఖ మీదుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.
Back to Top