వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా..


అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్డు సీరియస్‌..
సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలి...
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్డు ఆదేశం...
హైదరాబాద్ః వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై  హత్యాయత్నం కేసు విచారణను వాయిదా వేసింది. అన్ని పిటిషన్లను వచ్చే సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.ఏపీ ప్రభుత్వం అజమాయిషీ లేని థ«ర్డ్‌ పార్టీతో దర్యాప్తు చేయించాలని పటిషన్‌లో వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ పోలీసు పరిధి నుంచి కేసును సీఐఎస్‌ఎఫ్‌కు బదలాయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఆర్కే పిల్‌లో ప్రతివాదులుగా 10 మంది ఆన్‌ లా ఫుల్‌ ఎగనెస్ట్‌ సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఎవియేషన్‌ యాక్ట్‌ ప్రకారం సెక్షన్‌ 3(ఎ) కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్‌ పేర్కొన్నారు.కావాలనే కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తోందన్నారు.ఎన్‌ఐఏ యాక్ట్‌ సెక్షన్‌ 6 ప్రకారం ఎయిర్‌పోర్టు,ఎయిర్‌క్రాప్ట్‌లో అఫెన్స్‌ జరిగితే విచారణ ఎన్‌ఐఆర్‌ పరిధిలోకి వస్తుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.ఈ చట్టం గురించి పోలీసులకు తెలియకపోవడం తెలిసి తెలియనట్టుగా నటించడం సెక్షన్‌ 166 ప్రకారం శిక్షార్హులుగా పేర్కొన్నారు. ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం  చేసింది. సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ,కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్డు  తుదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
 
Back to Top