హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగును ఇంటిల్లిపాదులు సుఖ,సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకున్నారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని వైఎస్ జగన్ అభిలాషించారు.