మహిళలపై దాడి చేయడం అమానుషంకృష్ణా జిల్లా: మహిళలపై దాడి చేయడం అమానుషమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లపై లాఠీచార్జ్‌ని వైయస్‌ జగన్‌ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఓ వైపు మహిళా సాధికారత అని మాట్లాడుతూ..మహిళలపై దాడి చేయడం అమానుషమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. హక్కుల సాధనకు అంగన్‌వాడీ వర్కర్లు నిన్న విజయనగరం కలెక్టరేట్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా వారిపై లాఠీచార్జీ చేయడం పట్ల వైయస్‌ జగన్‌ ఖండించారు. తెలంగాణలో అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చంద్రబాబును వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు.
 

తాజా వీడియోలు

Back to Top