బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌కు నివాళి

హైద‌రాబాద్‌: దేశ మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జగ్జీవన్ రామ్ 110వ  జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా అయన చిత్ర‌ప‌టానికి వైయ‌స్ జ‌గ‌న్‌ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, శ్రీ‌నివాసులు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, అనంత వెంక‌ట్రామిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.


మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో జ‌యంతి వేడుక‌లు జ‌రుపుకున్నారు. వివిధ జిల్లాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, అనుబంధ సంఘాల నాయ‌కులు పాల్గొని జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం సేవా కార్యక్ర‌మాలు చేప‌ట్టారు.

ప్ర‌కాశం జిల్లా
ప్ర‌కాశం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు.ఒంగోలు న‌గ‌రంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కుప్పం ప్ర‌సాద్‌, జ‌జ్జ‌ర ఆనంద‌రావు, ఓబుల్‌రెడ్డి త‌దిత‌రులు జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
- దర్శి ప‌ట్ట‌ణంలో జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో జ‌గ్జీవ‌న్‌రామ్‌కు నివాళుల‌ర్పించారు.
-క‌నిగిరి ప‌ట్ట‌ణంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. పార్టీ ఇన్‌చార్జ్ బుర్రా మ‌ధుసూద‌న్‌రావు ,పార్టీ నాయ‌కులు మాజీ ఉప ప్ర‌దాని చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో క‌నిగిరి జెడ్సీటీసీ స‌భ్యుడు దంత‌లూరి ప్ర‌కాశం త‌దిత‌రులు పాల్గొన్నారు.

క‌ర్నూలు
మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ 110వ జ‌యంతి వేడుక‌లు జిల్లావ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. క‌ర్నూలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు నిర్వ‌హించారు. న‌గ‌ర పార్టీ కార్యాల‌యంలో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ హ‌ఫీజ్‌ఖాన్‌, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజ‌య్య‌, ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్ర‌సాద్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు.

నెల్లూరు
దేశ మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ 110వ జ‌యంతి వేడుక‌లు నెల్లూరు జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. వేదయపాలెం లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.


Back to Top