వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పామాయిల్ రైతులకు మద్దతుగా నిలిచేందుకు మరోసారి నవంబర్ మొదటి వారంలో జగన్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు సంబంధించి....పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ కూలంకషంగా చర్చించారు. <iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/BivOoCqyGxY" frameborder="0"/><br/>గిట్టుబాటు ధర లేక పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన జననేత తప్పకుండా జిల్లా పర్యటనకు వస్తానని వారికి హామీ ఇచ్చారు. పామాయిల్ రైతుల్లో ధైర్యం నింపడంతో పాటు.. గిట్టుబాటు ధర కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. గతంలోనూ వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి పామాయిల్ రైతులకు బాసటగా నిలిచారు.