తెలంగాణ పార్టీ నేతలతో వైయస్ జగన్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పార్టీ తెలంగాణ నాయకులు సమావేశమయ్యారు. రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, మండలస్థాయి దాకా పార్టీ విస్తరణకు చేపడుతున్న చర్యల గురించి వారిని ఈ సందర్భంగా జగన్ అడిగి తెలుసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఆరా తీశారు.

పార్టీ తెలంగాణ కమిటీ కార్యవర్గ భేటీకి ముఖ్య అతిథిగా రావాలని నేతలు విజ్ఞప్తి చేయగా, సమావేశాన్ని దసరా తర్వాత నిర్వహించాలని  సూచించారు.  వైయస్ జగన్‌తో సమావేశమైన వారిలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, బి.వెంకటరమణ తదితరులున్నారు.
Back to Top