ప్రత్యేక హోదా తీర్మానానికి మద్దతు: వైఎస్ జగన్

హైదరాబాద్) ప్రత్యేక హోదా తీర్మానానికి రాష్ట్ర విశాల ప్రయోజనాల రీత్యా మద్దతు
పలుకుతున్నామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారు. హోదా తీర్మానం మీద జరిగిన
చర్చలో వైఎస్సార్సీపీ తరపున వైఎస్ జగన్ పాల్గొన్నారు. గత ఏడాది ఆగస్టులో చేసిన
తీర్మానం ఏమైందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒక లక్షా 40 వేల కోట్లు ఇచ్చామని
బీజేపీ సభ్యులు చెబుతారని, అవన్నీ రోడ్లకు సంబంధించిన విషయాలని చంద్రబాబు అంటారని
స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ఉదహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు చిత్తశుద్ధి మీద తమకు నమ్మకం లేదని, అయినప్పటికీ రాష్ట్ర విశాల ప్రయోజనాల
రీత్యా ప్రత్యేక హోదా కావాలని కోరుతూ అసెంబ్లీలో చేస్తున్న తీర్మానానికి మద్దతు
ఇస్తున్నామని విస్పష్టంగా ప్రకటించారు. 

Back to Top