చేనేతలకు వైయస్‌ జగన్‌ అండ

  • చేనేత సత్యగ్రహ దీక్షలకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు
  • వైయస్‌ఆర్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు
గుంటూరు: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా నిలిచారని పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఒక్క అనంతపురం జిల్లాలోనే 33 మంది చేనేత కార్మికులు మృత్యువాత పడ్డారన్నారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు సర్కార్‌ ఆదుకోకపోతే, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లాలో ఐదు విడతలుగా భరోసా యాత్ర చేపట్టి బాధిత కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపారన్నారు. చేనేత కార్మికుల హక్కుల కోసం మంగళగిరిలో తలపెట్టిన చేనేత సత్యగ్రహ దీక్షకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సంఘీభావం తెలిపినట్లు మోహన్‌రావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంగళగిరిలో చేనేత కార్మికులు తలపెట్టిన దీక్షకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించాం. అనంతపురం జిల్లాలో 33  మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి గడపకూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు టీడీపీ సర్కార్‌ ఎలాంటి సాయం చేయలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఇవాళ మంగళగిరిలో చేనేత సత్యగ్రహ దీక్ష చేపట్టాం. ఈ వేదిక ద్వారా మా వాణి వినిపిస్తాం. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. చేనేత సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి.
Back to Top