అమరావతి బాబు..ఢిల్లీలో ఉత్తర కుమారుడు– చంద్రబాబు చెప్పేదొకటి..చేసేది మరోకటి
– కేంద్రంపై యుద్ధమంటారు..పరకాలను పక్కన కూర్చొబెట్టుకున్నారు
– బీజేపీపై యుద్ధమంటారు..మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ పదవి  ఇస్తారు
– నీతి ఆయోగ్‌లో బాబు దారుణంగా మాట్లాడారు
– ఇలా మాట్లాడితే కేంద్రం హోదా ఇస్తుందా?
– నిరుద్యోగ భృతి కింద ప్రతి ఇంటికి బాబు రూ. లక్ష బాకీ
– నష్టాలు రైతన్నకు..లాభాలు హెరిటేజ్‌కా?
– కొబ్బరి ఒలుపు కార్మికుల పరిస్థితి దారుణాతిదారుణం
– కొబ్బరి రైతులే కాదు వరి రైతులు కూడా నష్టాల్లో ఉన్నారు
– ప్రతి రైతుకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌
– రైతన్నలకు వడ్డీ లేని రునాలు అందిస్తాం
– ప్రతి మే నెలలో రైతన్నకు పెట్టుబడి కింద రూ.12,500
– రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి 
 – రైతులు పొరపాటున చనిపోతే రూ.5 లక్షలు ఆర్థికసాయం
– సహకార రంగంలోని డయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనం
– సాగునీటి రంగంలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం


తూర్పు గోదావరి: చంద్రబాబు చెప్పేది ఒకటి ..చేసేది మరోకటని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు కేంద్రంపై యుద్ధమని కేకలు వేసిన చంద్రబాబు..ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ముందు ఉత్తర కుమారుడయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పి.గన్నవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

– ఈ రోజు ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా ఎండలను ఎవరు ఖాతరు చేయడం లేదు. ఒకవైపు కష్టాలు, సమస్యలు చెబుతూ..మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి ఈ నడిరోడ్డుపై, ఎండలో నడవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈ ఎండలో నిలబడాల్సిన అవసరం అంతకన్న లేదు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయలతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– కోనసీమ..గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నాను. నిజంగా కోనసీమ ప్రాంతం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పలేం. ఇవాళ కోనసీమ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలు చూస్తే నిజంగా బాధనిపించింది. ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు. రైతులు నావద్దకు నాతో మాట్లాడుతున్న మాటలు..అన్నా..చంద్రబాబు సీఎం అయ్యాక మా అవస్థలు అన్నీఇన్నీ కావు. బతుకుతెరువు కోసం హైదరాబాద్, కేరళ, తమిళనాడు వెళ్తున్నామని చెబుతుంటే బాధనిపించింది. ఈ ప్రాంతంలో కొబ్బరి, వరి సాగు చేస్తున్నారు. కోనసీమలో 90 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. కొబ్బరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దాయనీయంగా ఉంది. అన్నా..అదేమి ఖర్మమో తెలియదు..చంద్రబాబు సీఎం కాగానే..కొబ్బరి పంటకు రేటు పడిపోయిందని చెబుతుంటే బాధనిపించింది. అన్నా..చంద్రబాబు సీఎం అయిన రెండేళ్లలో కొబ్బరి రేటు పడిపోయింది. చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే అంబాజిపేట మార్కెట్లో చంద్రబాబు సీఎం కాకముందు 600 కొబ్బరి దుకాణాలు ఉండేవి. ప్రస్తుతం 10 కొబ్బరి దుకాణాలు మాత్రమే ఉన్నాయి. కాంపిటేషన్‌ లేకుండా చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా? కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు. రూ.9 వేలు కూడా రావడం లేదు. కాయలు వలిచిన తరువాత వెయ్యి టెంకాలయకు రూ.12 వేలు కూడా రావడం లేదంటున్నారు. కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.15 వేలు అయితే..ప్రస్తుతం రూ.12 వేలు కూడా రావడం లేదు. చంద్రబాబు హయాంలో రైతులు పడుతున్న అవస్థలు ఇంతా అంతా కాదు. 
– చంద్రబాబు పాలనలో రైతులందరూ నా వద్దకు వచ్చి చెబుతున్న మాట..గతంలో కొబ్బరిపై 4 శాతం ట్యాక్స్‌ను వైయస్‌ రాజశేఖరరెడ్డి రద్దు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ పేరుతో బాదుడే బాదుడు. ౖ
– రైతు కూలీలు చెట్టునెక్కి కొబ్బరిని తీసి, వాటిని వలిసే కూలీల పరిస్థితి దయణీయంగా ఉంది. పొరపాటున ఆ రైతు కూలీ చెట్టుపై నుంచి పడితే పరిస్థితి  ఏంటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. చాలీ చాలనీ రెట్లు ఉన్నాయి. ఈ రేట్లు తట్టుకోలేక రైతు కూలీలు వలసలు వెళ్తున్నారు. మా పరిస్థితే దయాణీయంగా ఉంటే..కూలీలకు ఎక్కడి నుంచి ఇస్తామని రైతులు అంటున్నారు. నిజంగా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని మీ అందరి తరఫున చెబుతున్నారు.
– వరికి మద్దతు ధర రూ.1550 ఉంటే..రైతులకు రూ.1150 కూడా రావడం లేదని రైతు వాపోతున్నారు. పద్ధతి ప్రకారం చంద్రబాబు కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయకుండా పూర్తిగా ధాన్యం దళారీ పాలు అయిన తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దళారులు బాగుపడుతున్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కోనసీమ ప్రజలు బతుకుతున్నారు.
– గోదావరి నది ఇక్కడి నుంచి పోతున్నా కూడా రబీ సమయంలో శివారు పొలాలకు సాగునీరు అందడం లేదు. సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. అబ్బలపల్లి ఎత్తిపోతల పథకం చేయాలని రైతులు కోరుతున్నా..నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా?
– ఆ రోజుల్లో ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను నెమరువేసుకుంటున్నారు. గోదావరి నది ఈ ప్రాంతానికి ఎంత మేలో, అంతగా వరదలు వచ్చినప్పుడు కూడా అంతే నష్టం వస్తోంది. ఇటువంటి పరిస్థితి రాకుడదని దివంగత నేత గట్టు ప్రటిష్టం చేశారని రైతులు చెప్పుకుంటున్నారు. ఇదే నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేర రూ.70 కోట్లు ఖర్చు చేసి ఏటి గట్లు ప్రటిష్టం చేశారని రైతులు చెబుతున్నారు. మిగిలిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మంచి చేసిన నాయకుడిని ఎంతగా గుర్తు పెట్టుకుంటారో..ఏమీ చేయని చంద్రబాబును తిట్టుకుంటున్నారు.
– ఇదే కోనసీమలో చమురు, సహాజ వాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్నారు. వందల కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు ఏర్పాటు చేశారు.  గ్రామాల మధ్యలో నుంచి వెళ్తున్న పైప్‌ లీకై నగరం అనే ఊర్లో ప్రమాదం జరిగి అనేకమంది అమాయకులు చనిపోయారు. ఆ రోజు ఇక్కడికి వచ్చి నేనే పరామర్శించాను. ఆ రోజు కేంద్రంలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నారు. బీజేపీ, టీడీపీలు ఒకరికి ఒకరు పెళ్లి చేసుకున్నారు. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొత్త పెళ్లి  కొడుకు, పెళ్లి కూతురుగా సంసారం చేశారు. ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తారు. వీరి పొగడ్తలు చూసి చిలుకగోరింకలు కూడా అసూయపడ్డాయి. ఆ రోజు నగరం గ్రామాన్ని స్మార్ట్‌ విలేజీగా చేస్తామన్నారు. ఇంతవరకు ఏ మేరకు చేశారు. ఈ రోజు ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. చేశారా? ఆ రోజుల్లో ఆసుపత్రి అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. తాగడానికి నీరు కలుషితమైతే శుద్ధి చేస్తామన్నారు. చనిపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలకు ఇస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా కాలిపోయిన 9 మంది కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్లాస్టిక్‌ సర్జరీ ఆపరేషన్లు చేయించుకోలేక అవస్థలు పడుతున్నారు. బాధితులను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది.   ఇంతదారుణంగా పాలన సాగిస్తున్న చంద్రబాబు, కేంద్రంలోని బీజేపీ సిగ్గుపడాలి
– లంకల గన్నవరం నుంచి యధేచ్చగా ఇసుకను దోచేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. లోకేస్‌ ర్యాంపు అని ఇక్కడి ర్యాంపుకు పేరుపెట్టారన్నా ..ఏ కలెక్టర్, ఏ పోలీసు ఇక్కడికి వెళ్లడం లేదు. పోక్లెయిన్లు పెట్టి ఇసుకను దోచేస్తున్నారు. అన్నా..తవ్వడానికి ఏమీ లేక ఆ ర్యాంపులను వదిలేశారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నిజంగా మట్టిని, ఇసుకను, కాంట్రాక్టర్లను, బొగ్గును, రాజధాని భూములు, విశాఖ భూములు, చివరకు గుడి భూములు కూడా వదిలిపెట్టడం లేదు. పైన చంద్రబాబు దోచుకుంటే కింద గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు దోచుకుంటన్నాయి.
– అన్నా..ఇదే నియోజకవర్గంలో పేదవాళ్లకు ఇంటి పట్టాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. నాన్నగారి పాలనలో ఇదే నియోజకవర్గంలో 20 వేలు ఇల్లు కట్టించారని గొప్పగా చెబుతున్నారు. టీడీపీ పాలనకు, వైయస్‌ఆర్‌ పాలనకు ఎంత తేడా ఉందో గమనించండి.
– ఇదే నియోజకవర్గంలో నా వద్దకు పొద్దునే వచ్చారు. నాలుగు లంక గ్రామాలకు చెందిన ప్రజలు బ్రిడ్జి కావాలని వచ్చారు. నాలుగేళ్లుగా టీడీపీ నాయకులు బ్రిడ్జి కడతామని చెప్పి ఇంతవరకు కట్టలేదని వాపోయారు. రాజవరం, పొదలాడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని, ఇదే రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పాలకులను అడిగి అడిగి అలసీపోయామని ప్రజలు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి. ఇళ్ల కోసం రూ.30 వేలు వసూలు చేశారు. ప్రతి పేదవాడికి హామీ ఇస్తున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ పేద వాడు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెబుతున్నాను.  ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. లంక గ్రామాలకు వంతెన నిర్మిస్తానని మాట ఇస్తున్నాను. 
– చంద్రబాబు నాలుగేళ్లుగా రోజుకో సినిమా   చూపుతున్నారు. ఆయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటోంది. చంద్రబాబు ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరకముందే చూశాం. ఈ పేపర్లు, టీవీ చానళ్లు ఏం చూపించాయి. చంద్రబాబు బయలుదేరుతున్నారు. నీతి అయోగ్‌ మీటింగ్లో మోడీని నిలదీస్తారు..యుద్ధం ప్రకటిస్తారని ఊదరగొట్టారు. ఉత్తర కుమారుడి కథ తెలుసా..
ఉత్తర కుమారుడు కౌరవుల పై యుద్ధం చేసేందుకు వెళ్లే ముందు వారి తలల తీసుకొచ్చి తన చెల్లి పాదాల వద్ద పెడతానని ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికారు. మహాభారతంలో ఉత్తరకుమారుడు ఆ సైన్యాన్ని చూసి ఏం చేశారు. చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి. ఇక్కడేమో యుద్ధం చేస్తానని గొప్పలు చెప్పిన వ్యక్తి..ఢిల్లీలో మాత్రం చంద్రబాబు వంగి వంగి అతి వినయం చూపుతూ..మోడీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోయినా ఆయన పాకులాడిన నటన చూస్తే..ఉత్తర కుమారుడి కంటే ఎక్కువే. ఇక్కడేమో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు విఫరీతంగా పోరాటం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. కానీ కేంద్రంలోని రక్షణ మంత్రిగా ఉన్న నిర్మళసీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇక్కడేమో బీజేపీతో యుద్ధమంటారు..టî టీడీ బోర్డులో బీజేపీకి చెందిన మహారాష్ట్ర మంత్రి భార్యకు సభ్యత్వం ఇస్తారు. బాలకృష్ణ షూటింగ్‌కు వెంకయ్యనాయుడు వస్తారు. సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజులు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ విఫరీతంగా పొగిడారు. చేసేది ఒక్కటి..చెప్పెది మరోకటి. హోదా కోసం తన ఎంపీల కోసం రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది..దేశం మొత్తం మనవైపు చూస్తుందని తెలిసీ కూడా చంద్రబాబు ఆ పని చేయరు. రాజీనామా చేసిన ఎంపీలపై మాత్రం బురద చల్లమని ఈ పెద్ద మనిషి ఆదేశిస్తారు. చంద్రబాబు నిన్న నీతి ఆయోగ్‌ మీటింగ్లో మోదీని నిలదీస్తారని అందరూ భావించారు. ఈ మీటింగ్‌లో ప్రత్యేక హోదా కావాలని అడగకుండా..రాష్ట్రం బ్రహ్మండంగా ఉందని చంద్రబాబు గొప్పలు చెప్పారు. దేశం కన్న రెట్టింపు వేగంతో రాష్ట్రం పరుగులు తీస్తుందని చెబితే కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తారా? అటువంటి వేదిక మీద ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం నష్టపోతుందని చెప్పాల్సింది పోయి..రాష్ట్రం గురించి గొప్పలు చెబుతారా? రాష్ట్రం 10.5 శాతం వృద్ధిరేటు ఉందని చెప్పారు. 
– ఇవాళ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని రైతులు అవస్థలు పడుతుంటే..చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి గొప్పలు చెప్పి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికలకు ముందు ఏమన్నారు. రైతు రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రూ.87 వేల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా..ఈయన చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు. 
– ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నారు..పిల్లలు తాగి చెడిపోతున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు తీసేస్తాను. మద్యాన్ని తగ్గిస్తానని అన్నారు. ఈ పెద్ద మనిషి హయాంలో మందు షాపు లేని గ్రామం ఉందా? చంద్రబాబు హయాంలో ప్రతి ఊర్లో మందు షాపు ఉంది. పిల్లలను తాగుబోతులుగా చేస్తున్నారు. హైటెక్‌ పరిపాలనలో ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ తీసుకొని ఎవరు రావడం లేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన గమనించండి. 
– పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తానన్నారు. నేనే పొదుపు సంఘాలు కనిపెట్టానని సిగ్గులేకుండా చెప్పారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా పొదుపు రుణాలు మాఫీ కాలేదు. 
– పిల్లలను మోసం చేయాలంటే నాలుగు సార్లు ఆలోచిస్తారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటే ఏడాదిలో 19 లక్షల ఇల్లు కట్టిస్తాడట. నిజంగా ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చే సరికి విఫరీతంగా అబద్ధాలు ఆడుతారు. పింఛన్లు ఇవ్వలేదన్న సంగతి ఇపుడు గుర్తుకు వస్తుంది. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..ఈ వ్యవస్థలో మార్పు రాదు. ఎన్నికల్లో ఏదైనా హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ఆ నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. 
– ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే..రేపొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? ఎన్నికల్లో చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేస్తానని చెవ్వుల్లో పూలు పెడతారు. ఆ తరువాత చిన్న చిన్న అబద్ధాలకు నమ్మరని తెలిసి..రేపు పొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. నమ్ముతారా? నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. అప్పటికీ నమ్మరని చంద్రబాబుకు తెలుసు.. కాబట్టి ఏం చేస్తారో తెలుసా..ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. నమ్ముతారా? డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. కుదరదు..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయతీ అన్న పదాలకు అర్థం వస్తుంది.
 – రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి మీటింగ్‌లో కొన్ని అంశాలు చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను.
– ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. రైతులకు రుణాలు అందడం లేదు. పెట్టుబడులకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుకాలం కష్టించి పంట పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక..రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేపడుతాం. రైతులకు ప్రధాన సమస్య ఎప్పుడు వస్తుందంటే..పంటలు వేసుకునేందుకు పెట్టుబడుల కోసం సమస్యలు వస్తాయి. పెట్టుబడులు పెరుగుతూ పోతే..రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులు తగ్గించేందుకు మనం ఏం చేస్తామంటే..
– ఇవాళ ప్రతి రైతు అవస్థలు పడుతున్న పరిస్థితిని తప్పించేందుకు ప్రతి రైతుకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని మాట ఇస్తున్నాను. ఇలా చేయడం వల్ల పెట్టుబడిలో ఊరట కలుగుతుంది.
– రైతులకు ఇవాళ బ్యాంకుల్లో రుణాలపై వడ్డీలపై వడ్డీలువసూలు చేస్తున్నారు. వడ్డీలేని రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు పూర్తిగా రుణాలు ఇవ్వడం లేదు. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. గత ప్రభుత్వాలు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ సొమ్ము చంద్రబాబు కట్టడం మానేశారు. రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని మాట ఇస్తున్నాను.
– ప్రతి రైతులు జూన్‌ మాసంలో వర్షాలు పడగానే పంటలు వేసుకోవాలని ఎదురు చూస్తాడు. పంటలు వేసుకునేందుకు పెట్టుబడుల కోసం అవస్థలు పడుతారు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు తిరుగుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మనందరి ప్రభుత్వం వచ్చాక మే మాసంలోనే ప్రతి రైతుకు రూ.12,500 ఇచ్చి తోడుగా నిలబడతాం. ఈ డబ్బు ఎకరా ఉన్న రైతుకు 90 శాతం పెట్టుబడులకు సరిపోతుంది. రెండు ఎకరాలు ఉన్న రైతుకు దాదాపు 40 శాతం వరకు సరిపోతుంది. అంతకన్న ఎక్కువగా ఉన్న రైతులకు ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుంది. 
– పెట్టుబడులు తగ్గించేందుకు మనం చేయబోయే నాలుగో కార్యక్రమం ఏంటంటే..బోర్లు వేస్తుంటే ఫెయిల్‌ అవుతున్నాయి. ఇలా బోర్లు వేసి అప్పులపాలవుతున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు వేస్తామని హామీ ఇస్తున్నాను.  ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూపాయినరకే ఇ స్తానని మాట ఇస్తున్నాను. 
– పంట చేతికి వచ్చినప్పుడు..అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్నారు. ఇవాళ వరి, కొబ్బరి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చుతాం. గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. ఆ డబ్బులు పోయిన పర్వలేదు..మీ ముఖాల్లో చిరునవ్వులు చూస్తాను. ఫలాని పంట వేసేముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
– ప్రతి నియోజకవర్గంలో కోల్డుస్టోరేజీలు, గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు తోడుగా ఉండేందుకు ప్రకృతి వైఫరీత్యాల నిధి రూ. రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. కరువు వచ్చినా రైతులు నష్టపోకుండా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. 
– రైతులకు పంటలతో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు సబ్సిడీలో అవులు, గేదెలు అందజేస్తాం. ప్రతి లీటర్‌పై నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చి తోడుగా ఉంటాం. పాడి రైతులకు తోడుగా ఉండేందుకు సహకార రంగంలోని డయిరీలను తెరిపిస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాక సహకార రంగంలోని డయిరీలను మూత వేయించారు. 
– ఈ పరిస్థితి రైతుకు రాకుడదని మసస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైతుకు పొరపాటున ఏదైనా జరిగినా, ఆత్మహత్య చేసుకున్నా..ఆ రైతన్న పైకి వెళ్లాక కుటుంబం వైపు చూస్తాడు. ఆ కుటుంబాన్ని ఎవరైనా పట్టించుకుంటారా అని ఆకాశం నుంచి చూస్తాడు. ఆ కుటుంబ సభ్యుల ముఖంలో చిరునవ్వులు తీసుకొచ్చేందుకు రూ.5 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తాను. ఒకేసారి రూ.5 లక్షలు ఇవ్వడమే కాదు.. అప్పుల వారు గుంజుకోకుండా ఉండే పరిస్థితి రానివ్వను. రేపు పొద్దున మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మొట్ట మొదటి శాసన సభ సమావేశంలో ఓ చట్టం తీసుకువస్తాం. ఇవన్నీ చేయడం వల్ల రైతుకు మేలు జరుగుతుందని భావిస్తున్నాను.
– సాగురంగంలోని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తాం. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన చేయడం లేదు..ఆ ప్రాజెక్టుల నుంచి డబ్బులు ఎలా గుంజాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తాను. ప్రతి రైతుకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ..నవరత్నాల్లోని మిగిలిన అంశాలను రాబోయే మీటింగ్‌లో చెబుతాను. వీటిలో ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు..ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా..  
 
Back to Top