పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు


– రెయిన్‌గన్ల పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు
– నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ అయిన నెరవేర్చారా?
– బీసీలపై ప్రమంటే ఏంటో చూపిస్తా
– మీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా
– పెందుర్తి ఘటనతో చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి
– గుడి భూములు, గుడిలో ఆస్తులను దోచుకుంటున్న టీడీపీ నేతలు
– దుర్మార్గ పాలన పోవాలి..రాజకీయాల్లో విశ్వసనీయ రావాలి

అనంతపురం: చంద్రబాబు పిట్టల దొర వేషంలో వచ్చి రైతులను మోసం చేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు రెయిన్‌గన్ల పేరుతో ఎలా మోసం చేశాడో పిట్ట కథ రూపంలో వైయస్‌ జగన్‌ ప్రజలకు వివరించారు. బాబు మాటలు నమ్మి శివన్న అనే రైతు చేసిన అప్పులు తీర్చేందుకు ఊరూరా వడియాలు అమ్ముకుంటున్నారని వివరించారు. ఇలాంటి పిట్టల దొరను నమ్మొదని వైయస్‌ జగన్‌ ప్రజలను హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. పొద్దుటి నుంచి వేలాది మంది నాతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి ఇలా నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు. కష్టమని భావించకుండా నాపై ఆప్యాయతలు చూపిస్తున్నారు. మీ అందరికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మీ మనసాక్షిని అడగండి.. 
 ఈ రోజు నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన పూర్తి అయిన తరువాత మనం ఇక్కడ ఏకమయ్యాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఇటీవల చంద్రబాబే తన కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూసిన తరువాత మీ అందరిని అడుగుతున్నాను. ఎవరైనా గుండెలపై చేతులు వేసుకొని మీ మనసాక్షితో మేం సంతోషంగా ఉన్నామని చెప్పగలరా?

పిట్టల దొర ఎవరో తెలుసా?
అనగనగా ఒక పిట్టల దొర ఉన్నాడు. ఈయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా అబద్ధాలు చెప్పేవాడు. ఎవరైనా ఇంతగా అబద్ధాలు చెప్పేవాడిని వీడు పిట్టల దొర అంటాం. ఇదే అమడగూడు మండలం గుండువారిపల్లె్ల అనే గ్రామం ఉంది. ఈ ఊర్లో శివన్న అనే రైతు ఉండేవాడు. ఈయనకు 5 ఎకరాల భూమి ఉంది. ఇందులో దాదాపుగా రూ.90 వేలు ఖర్చు చేసి వేరుశనగ పంట వేశాడు. చంద్రబాబు సీఎం అయ్యారు, అనంతపురం జిల్లాలో కరువు, అపై వర్షాలు కురవలేదు. ఇలాంటి సమయంలో ఓ పిట్టల దొరవచ్చాడు. ఆయన ఏమన్నారో తెలుసా..దేవుడిని నమ్ముకోవద్దు, నన్ను నమ్ముకో నీ పొలానికి నీళ్లు తెస్తానని చెప్పాడు. శివన్న అమాయకుడు కాబట్టి ఆ పిట్టల దొరకు 9 ఏళ్ల అనుభవం ఉంది కదా అని సరే నీళ్లు తెప్పించమని కోరాడు. ఆ పిట్టల దొర ఏమన్నాడంటే..నా వద్ద రెయిన్‌గన్‌ ఉంది, దాంతో వర్షాన్ని తెప్పిస్తానని చెప్పాడు. ఆ వెంటనే అధికారులు పిట్టల దొర వస్తునాడని ఓ గుంత తవ్వారు. అందులో ఓ ట్రాక్టర్‌తో నీరు తెచ్చి నింపారు. ఆ తరువాత పిట్టల దొర వచ్చి ఆ గన్‌ పక్కన నిలబడి టపటప ఫోటోలు దిగారు. ఆ గుంతలో ఉన్న నీటితో పొలంలో చిలకరించారు. ఆ తరువాత శివన్న భోజనానికి వెళ్లాడు. వెంటనే అధికారులు టార్ఫాలిన్‌ పట్టా చుట్టేశారు. రెయిన్‌ గన్‌ ఎత్తుకెళ్లారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఆ తరువాత శివన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఈ ఫోటోలు చూడండి. శివన్నకు హామీ ఇస్తున్న పిట్టల దొర, ఆయన వచ్చే గంట ముందు తయారు చేసిన గుంత ఫోటో, ఆ గుంత వద్ద పిట్టల దొర వెంట మంత్రులు కూడా వచ్చి నిలబడ్డారు. ఇలా గన్‌ ఆన్‌ చేసి నీరు కొట్టారు. ఆయన వెళ్లిపోయిన గంటకు పంట పొలం ఎండిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన శివన్న బిత్తరపోయాడు. శివన్నకు ఐదు ఎకరాలకు  అర బస్తా దిగుబడి వచ్చింది. ఇప్పుడు రూ.90 వేల అప్పు తీర్చేందుకు శివన్న ఊరూరు తిరుగుతూ వడియాలు అమ్ముతున్నారు. ఇంతకు ఆ పిట్టల దొర ఎవరో తెలుసా?. చంద్రబాబు అని బాగా చెప్పారు.

బాబు సహవాసమే వద్దు: శివన్న, రైతు
చంద్రబాబుకు ఓటు వేస్తే మోసం చేశాడు. ఆయన సహవాసమే వద్దని రైతు శివన్న అన్నారు. టీడీపీ పాలనలో రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వడం లేదు. అప్పులు కట్టేందుకు ఊరూరు తిరుగుతున్నాను. తన భార్య బెంగుళూరులో హోటల్‌లో పని చేస్తుందని శివన్న చెప్పారు.

ఇంతగా మోసం చేయడం ధర్మమేనా
చంద్రబాబు అధికారం కోసం ఇంతగా మోసం చేయడం ధర్మమేనా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మడని పేరు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. అంతటితో ఆగకుండా ఇంటికో కారు కొనిస్తా అంటారు. ఇలాంటి వ్యక్తులు బంగాళఖాతంలో కలిసిపోయాలి. ఇది జరగాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ రావాలి.

పుట్టపర్తిలో ఇచ్చిన ఒక్క హామైనా నెరవేర్చారా?
పుట్టపర్తి నియోజకవర్గంలో సాక్ష్యాత్తు భగవాన్‌ స్వరూపుడు సత్యసాయిబాబా ఇక్కడ జన్మించారు. ఇక్కడ నిలబడి చంద్రబాబు చెప్పిన ఒక్క హామీ అయినా నెరవేరిందా అని అడుగుతున్నాను. ఇదే నియోజకవర్గంలో దాదాపు 193 చెరువులు ఉన్నాయి. పుట్టపర్తిని ఆధ్వాత్మిక కేంద్రంగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐటీ హబ్‌గా మార్చుతానని చెప్పారు. బుగ్గపట్నాన్ని కలుపుతు రింగ్‌ రోడ్డు, డిగ్రీ కళాశాల, అమడగుంట్లలో పరిశ్రమ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఇవి ఎక్కడైనా కనిపించాయా?. ఈ పాలన పోవాలి. రేపు దేవుడు అశీర్వదించి, మీ దీవెనతో మన అందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మనం ప్రకటించిన నవరత్నాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని చెబుతున్నాను.

ఇది బీసీలపై ప్రేమ అంటే 
బీసీలపై ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేను చెబుతున్నాను. వినండి..ఆలోచన చేయండి. ఇదే చంద్రబాబు పాలనను నాలుగేళ్లు చూశారు. మీ పిల్లలను ఇవాళ ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులు చదివించే నమ్మకం ఉందా? చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏడాదికి రూ.35 వేలు ఇస్తున్నారు. లక్ష రూపాయలు ఫీజులు కట్టాల్సి ఉంది. మిగతా డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీరు పిల్లలను చదవించగలరా? పేదవాళ్లు తమ బిడ్డలను చదివించలేని స్థితిలో ఉన్నారు. నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదల చదువుల కోసం ఒక్క అడుగు ముందుకు వేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఆదుకున్నారు. నవరత్నాల్లో భాగంగా చదువుకుంటున్న పిల్లల కోసం నాన్నగారి స్ఫూర్తిగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని మాట ఇస్తున్నాను. ఏం చదువులు చదువుతారో మీ ఇష్టం..ఎంత ఖర్చు అయినా నేను చదవిస్తాను. హాస్టళ్లలో మెస్‌ చార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను. చిన్న పిల్లల చదువుల కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఇది బీసీలపై ప్రేమ అంటే. 
– మనం అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ. 2 వేలు ఇస్తానని ప్రతి అవ్వ, తాతకు చెబుతున్నాను. పింఛన్‌ వయో పరిమితి 45 ఏళ్లకే తగ్గిస్తానని మాట ఇస్తున్నాను. ఒకవారం పనులకు వెళ్లకపోతే ఇంట్లో గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి తోడుగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాను. 
– మనం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పేడవాడికి ఇల్లు కట్టిస్తానని మాట ఇస్తున్నాను. కడుపు నిండ కష్టాలు ఉన్నా..కరువు సీమలో ప్రేమానురాగాలు పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

దుర్మార్గమైన పాలన పోవాలి..
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని, ఇలాంటి పాలన పోవాలని వైయస్‌ జగన్‌ అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మానవత్వం మరిచిపోయి రాక్షసులు అయిన వేళ టీడీపీ నాయకులు ఒక దళిత మహిళను అవహేళన చేసిన ఘటన ఈ రోజు పేపర్లో కనిపించింది. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా. ప్రభుత్వం 14 దళిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ భూములను ప్రభుత్వం మళ్లీ లాక్కొవాలని చూశారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తే అక్కడి నుంచి కూడా ఉత్తర్హులు వచ్చాయి. వారిని బలవంతంగా తరిమేందుకు మానవత్వం లేకుండా ఓ దళిత మహిళ చీరను లాగేసి అవహేళన చేశారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి అనే వ్యక్తి సిగ్గుతో తలదించుకోవాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వెంటనే వారిని అరెస్టు చేయాలి. కనీసం ఏడేళ్ల పాటు జైల్లో పెట్టాలి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నోట్లో నుంచి స్పందన రావడం లేదు. 
– కర్నూలు జిల్లాలోని ఓ కోటలో బంగారం ఉందని కలెక్టర్లు, అధికారులు అనధికారికంగా రాత్రికి రాత్రి తవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో మట్టి నుంచి ఇసుక, మద్యం, కాంట్రాక్టర్లు, గుడి భూములను వదలడం లేదు. చివరకు గుడిలోని ఆస్తులను కూడా దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పాలన పోవాలని దేవుడిని మ్రోక్కండి అని వేడుకుంటున్నాను.

నరసింహ నా గుండెల్లో ఉంటాడు
పైలా నరసింహులు నా గుండెల్లో ఉన్నారని వైయస్‌ జగన్‌ అన్నారు. టీడీపీకి చెందిన పైలా నరసింహులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ సమయంలో తనకు వైయస్‌ జగన్‌ ఎంతో ప్రాధాన్యత కల్పించారని, పార్టీ మారి తప్పు చేశానని, క్షమించాలని కోరారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ తాను నా గుండెల్లో ఉన్నారని చెప్పడంతో సభీకులు హర్షాధానాలు చేశారు.
 
 




 
  


 
Back to Top